మహేశ్ మూవీ ప్రీమియర్ షో టాక్ .. ఆ సీన్ .. ఆ ఫైట్ అదుర్స్ అంటున్న ప్రేక్షకులు!
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'భరత్ అనే నేను'
- యూఎస్ నుంచి పాజిటివ్ టాక్
- అభిమానుల సంతోషం
ఈ సినిమాలో హెలికాఫ్టర్ లో రాయలసీమకి చేరుకుని .. అక్కడ ఆయన జనంలోకి వెళ్లే సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని అంటున్నారు. ఇక 'దుర్గా మహల్' థియేటర్ లోని ఫైట్ సీన్ ఈ సినిమాలోనే కాదు, ఇంతకు ముందు మహేశ్ చేసిన అన్ని సినిమాల్లోని ఫైట్ సీన్స్ ను మించి ఉందని చెబుతున్నారు. ఆడియన్స్ రెప్ప వేయడం మరిచిపోయేలా ఈ ఫైట్ సీన్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.