సల్మాన్ ఫిట్ నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో కండలు పెంచుతోన్న చరణ్
- బోయపాటి దర్శకత్వంలో చరణ్
- కథానాయికగా కైరా అద్వాని
- ఈ నెల 21 నుంచి సెట్స్ పైకి చరణ్
రెండవ షెడ్యూల్ లో .. అంటే, ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో చరణ్ పాల్గొంటాడని నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో .. మరింత ఫిట్ నెస్ తో చరణ్ కనిపించనున్నాడు. అందుకోసం సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ను రప్పించారు. ఆయన అధ్వర్యంలో చరణ్ ఆహార నియమాలు పాటిస్తూ .. జిమ్ లో కసరత్తు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది.