మహేశ్ మూవీ ప్రమోషన్స్ .. ఒక్క హైదరాబాద్ లోనే 3 కోట్ల ఖర్చు!
- విడుదల తేదీకి దగ్గరలో 'భరత్ అనే నేను'
- రేపటి నుంచి ప్రమోషన్స్ లో మహేశ్
- భారీ ఓపెనింగ్స్ ఖాయమనే టాక్
ఈ సినిమాకి భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వలన, ఓపెనింగ్స్ ద్వారా పెద్దమొత్తాన్ని రాబట్టేలా చూస్తున్నారు. ఓపెనింగ్ వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. కైరా అద్వాని గ్లామర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.