'శ్రీరెడ్డితో నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ ఫొటో'పై 'మా' అధ్యక్షుడు శివాజీరాజా స్పందన
- అభిరామ్ నటుడు కాదు, నిర్మాత కాదు
- మాకు సంబంధం లేని విషయం అది
- మేము తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహిస్తున్నాం
టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం శివాజీ రాజా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కోన వెంకట్, అభిరామ్ గురించి స్పందించాలని విలేకరులు కోరగా.. దీంతో శివాజీ రాజా మాట్లాడుతూ... 'కోన వెంకట్ తో మాకు సంబంధం లేదు.. రైటర్స్ అసోసియేషన్ అనేది ఉంది. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు. ఇక అభిరామ్ నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అది' అని వ్యాఖ్యానించారు.
కాగా, తాము తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించడం లేదని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తెలుగు ఆర్టిస్టులను టాలీవుడ్ ప్రోత్సహిస్తూనే ఉందని అన్నారు.