కరీనా కపూర్ తన కుమారుడు ఏమి కావాలని కోరుకుంటోందో తెలుసా?
- తైమూరే అతని కెరీర్ ను నిర్ణయించుకుంటాడన్న కరీనా
- మంచి క్రికెటర్ అయితే చూడాలని ఉందన్న అగ్ర నటి
- తైమూర్ తాత పటౌడీ లెజెండరీ క్రికెటర్
తైమూర్ ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా... తైమూర్ ఏ కెరీర్ ను ఎంచుకోవాలనే దానిపై తనకు స్పష్టమైన అభిప్రాయం లేదని చెప్పింది. తన కెరీర్ ను తైమూరే నిర్ణయించుకుంటాడని తెలిపింది. దీనిపై మరింత లోతుగా ప్రశ్నిస్తే... తైమూర్ ను మంచి క్రికెటర్ గా చూడాలనుకుంటున్నానని సమాధానమిచ్చింది. తైమూర్ తాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక లెజెండరీ క్రికెటర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.