'మహాభారతం' ప్రాజెక్టును పక్కన పెట్టేసిన ఆమిర్ ఖాన్
- 'మహాభారతం' గురించి ప్రస్తావించిన ఆమిర్ ఖాన్
- కృష్ణుడు .. కర్ణుడు పాత్రల పట్ల ఆసక్తి
- ఆలోచన విరమించుకున్న ఆమిర్
ఈ సినిమాలో తాను శ్రీకృష్ణుడిగా గానీ .. కర్ణుడిగా గాని నటిస్తానని చెప్పారు. అయితే ముస్లిం అయిన ఆయన ఈ సినిమాలో నటించడమేంటంటూ కొంతమంది తీవ్రమైన విమర్శలు చేశారు. దాంతో ఆమిర్ ఖాన్ ఆలోచనలో పడ్డాడట. అంతేకాదు .. ఇటీవల విడుదలైన కొన్ని చారిత్రక చిత్రాలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నది చూసిన తరువాత ఆయన 'మహాభారతం' ఆలోచనను దాదాపు విరమించుకున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి చిత్రాల జోలికి వెళ్లి అనవసరమైన వివాదాలను తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.