'రేసు గుర్రం' యాక్షన్ సీన్లో మా అంచనా తప్పింది .. చావును దగ్గరగా చూశాం: ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్
- 'సరైనోడు'లో లారీ జంప్ చేస్తుంది
- ఆ ఫీట్ ఫస్టు టైమ్ చేసింది మేమే
- మేం అనుకున్న చోట లారీ ఆగలేదు
" 'రేసుగుర్రం' సినిమాలో లారీ జంప్ చేయాలి. లారీ జంప్ చేయడమనే ఫీట్ ను ఫస్ట్ టైమ్ చేసింది మేమే. అంతకుముందు కారు జంప్ చేసే సీన్స్ చేశాం కనుక, పైకి లేచిన కారు ఎక్కడ దిగుతుంది? అనే విషయం మాకు తెలుసు. కానీ లారీ జంప్ చేయడమనేది మొదటిసారి కనుక, మా అంచనా తప్పింది. ఒక్కసారిగా పైకి లేచిన లారీ .. మేం వేసుకున్న మార్క్ ను దాటిపోయి .. దాదాపు కెమెరాల దగ్గరికి వచ్చేసింది. చావును చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి మాకు రెండు రోజులు పట్టింది" అని చెప్పుకొచ్చారు.