'ఎమ్మెల్యే' ప్రీ రీలీజ్ బిజినెస్ 22 కోట్లు!
- కల్యాణ్ రామ్ హీరోగా 'ఎమ్మెల్యే'
- కథానాయికగా కాజల్
- ఈ నెల 23వ తేదీన భారీ రిలీజ్
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ న్యూలుక్ తోను .. కాజల్ మరింత గ్లామర్ గాను కనిపిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మాస్ లోను .. యూత్ లోను ఈ సినిమాకి క్రేజ్ పెరగడంతో, ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని అంటున్నారు. 22 కోట్ల దగ్గర ప్రీ రీలీజ్ బిజినెస్ ను క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 4.2 కోట్లకు .. ఓవర్సీస్ లో 5 కోట్లకు అమ్ముడవడం విశేషం. భారీస్థాయిలో చేస్తోన్న ప్రమోషన్స్ .. భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.