'నేల టికెట్' కోసం భారీ సెట్ .. ఎక్కువశాతం షూటింగ్ అక్కడే!
- రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్
- అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ
- మే చివరలో విడుదల చేయాలనే ఆలోచన
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీగా అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ చివరినాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, మే చివరలో విడుదల చేయనున్నారు. మాళవిక శర్మ నటిస్తోన్న ఈ సినిమా నుంచి, రేపు ఫస్టులుక్ విడుదల కానుంది.