సంతోశ్ శ్రీనివాస్ కి పవన్ తేల్చి చెప్పేశాడట!
- పవన్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసిన సంతోశ్ శ్రీనివాస్
- పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్
- ఇక కుదరదని చెప్పేసిన పవన్
నిజంగానే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ 'కందిరీగ' దర్శకుడు పవన్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా .. ఉండదా అనే సందేహం పవన్ అభిమానుల్లో ఉండేది. కానీ ఇప్పుడీ ప్రాజెక్టు లేనట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తాను సినిమా చేసే అవకాశం లేదనీ, మరో ప్రాజెక్టుతో ముందుకు వెళ్లమని తాజాగా సంతోశ్ శ్రీనివాస్ కి పవన్ చెప్పినట్టుగా సమాచారం. దాంతో సంతోశ్ శ్రీనివాస్ మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడట.