ముస్లింల గురించి మాట్లాడుతున్నారు.. బీసీల గురించి ఎందుకు మాట్లాడరు?: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్
- ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు
- ఎంఐఎం మెప్పు కోసం కేసీఆర్ ఆరాటపడుతున్నారు
- పూటకోమాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు
ఎంతమాత్రం అమలుకు నోచుకోనటువంటి ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంఐఎం మెప్పు పొందేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.