భర్తపై పోరాడుతున్న సంగీతపై మరోసారి దాడిచేసిన అత్తమామలు
- కోర్టు ఆదేశాలతో భర్త ఇంట్లోనే ఉంటున్న సంగీత
- అక్కను చూసేందుకు వచ్చిన సంగీత సోదరుడు
- ఎందుకువచ్చావంటూ దాడి
ఈ క్రమంలో ఆమెను చూసేందుకు ఆదివారం రాత్రి సంగీత సోదరుడు రంజిత్ రెడ్డి వచ్చాడు. గమనించిన శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, సంగీత మరిది అయిన శ్రీధర్ రెడ్డి అతడిపై దాడికి దిగాడు. అతడి దాడిని సంగీత సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండడాన్ని చూసిన మరిది, అత్తమామలు ఆ ఫోన్‌ను లాక్కొని ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో సంగీత వెంటనే వెళ్లి అత్తమామలు, మరిదిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.