రాజ్ తరుణ్ 'లవర్' సినిమా రిలీజ్ డేట్ ఖరారు
- రాజ్ తరుణ్ హీరోగా 'లవర్'
- కథానాయికగా రిద్ధి కుమార్
- జూన్ 14న భారీ స్థాయి విడుదల
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను, జూన్ 14వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు. ఈ సినిమాతో తెలుగులో తనకి మరిన్ని ఛాన్సులు వస్తాయని రిద్ధికుమార్ భావిస్తోంది. హీరో హీరోయిన్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి .