సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- నితిన్ సినిమాలో రాశిఖన్నా
- తెలుగులో మలయాళ 'ఆనందం'!
- తమిళం నేర్చుకుంటోన్న శృంగారతార
* మలయాళంలో నాలుగు కోట్లతో నిర్మించిన 'ఆనందం' చిత్రం భారీ విజయాన్ని సాధించి, 20 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
* బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ ఇప్పుడు తమిళం నేర్చుకుంటోంది. దర్శకుడు వడివుడియాన్ దర్శకత్వంలో రూపొందే తమిళ చిత్రంలో సన్నీ వారియర్ క్వీన్ గా నటిస్తోంది. ఇందుకోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం కూడా నేర్చుకుంటోంది. పనిలోపనిగా డైలాగులు బాగా అర్థం కావడానికి తమిళం కూడా నేర్చుకుంటోందట.