షూటింగ్ పూర్తి చేసుకున్న 'మెహబూబా'
- ప్రేమకథా కావ్యంగా 'మెహబూబా'
- ఆకాశ్ పూరీ జోడీగా నేహా శెట్టి
- డబ్బింగ్ పనులు మొదలు
1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆకాశ్ పూరీ జోడీగా నేహాశెట్టి నటించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథలకి భిన్నంగా ఈ సినిమా నిలుస్తుందనేది యూనిట్ సభ్యుల మాట. ఈ సినిమాతో ఆకాశ్ పూరీ లవర్ బాయ్ గా మంచి మార్కులు కొట్టేస్తాడని అంటున్నారు. సందీప్ చౌతా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.