నరదిష్టిని అడ్డుకుంటున్న సన్నీలియోన్.. పంటలకు కాపుగా శృంగారతార ఫొటోలు!
- నెల్లూరు జిల్లా రైతుల వినూత్న ఆలోచన
- సోషల్ మీడియాలో వైరల్
- ప్రజల దృష్టిని మళ్లించేందుకు పొలం గట్లపై సన్నీ పోస్టర్లు
శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండడంతో దారిన పోయే వారు అటువైపు చూడకుండా ఉండలేకపోతున్నారు. బాటసారుల దృష్టి మొత్తం తమ పంటలపైనే ఉండడంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లించేందుకు పొలం గట్లపై పై సన్నీలియోన్ అర్ధనగ్న బ్యానర్లను ఏర్పాటు చేశారు.
అక్కడితో ఆగిపోలేదు.. ‘ఒరేయ్, నన్ను చూసి ఏడవకురా’ అని కింద స్లోగన్ కూడా రాయించారు. ఇప్పుడీ బ్యానర్లు హాట్ టాపిక్ అయ్యాయి. మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరో ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త వైరల్ అయింది.