మహేశ్ బాబుకి మా కథ నచ్చలేదు.. అందుకే పట్టాలెక్కలేదు!: వీవీ వినాయక్
- కొంతకాలం క్రితం మహేశ్ కి కథ వినిపించాను
- మరో కథతో కలవమన్నారు
- ఆయన కోసం ఓ కథను రెడీ చేస్తాను
అప్పుడాయన స్పందిస్తూ .. " మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలనుకున్న మాట వాస్తవం. ఆయనతో కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ఆ కథ అంతగా మహేశ్ కి నచ్చలేదు .. అందుకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తనకి ఆ కథ అంతగా నచ్చలేదనీ .. మరో కథ రెడీ చేయమని అప్పట్లో మహేశ్ చెప్పాడు. కుదిరితే తప్పకుండా చేస్తానని అన్నాడు. వీలు చూసుకుని ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తాను" అని చెప్పాడు. వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు తన సినిమాను పూర్తిచేసేలోగా, ఆయన కోసం వినాయక్ కథను సిద్ధం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.