నయనతార తీరు ఆగ్రహాన్ని తెప్పించిందట!
- తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి క్రేజ్
- అభిమాన హీరోల పేర్లు చెప్పిన నయన్
- తెలుగు హీరోల పేర్లు చెప్పకపోవడం పట్ల అసహనం
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో "మీ అభిమాన హీరోలు ఎవరు?" అనే ప్రశ్న నయనతారకి ఎదురుకాగా, ఆమె అజిత్ .. విజయ్ పేర్లు చెప్పిందట. తెలుగు దర్శక నిర్మాతలు .. హీరోలు నయనతారను ఎంతగానో ప్రోత్సహించారు. అవేమీ గుర్తుపెట్టుకోకుండా ఆమె తమిళ హీరోల పేర్లు మాత్రమే చెప్పడంతో, తెలుగు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. నయనతార తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పేముందనే వాదన కూడా వినిపిస్తూ ఉండటం విశేషం.