'సీక్రెట్ సూపర్‌స్టార్' చైనాలో సూపర్ సక్సెస్!
- ఈ నెల 19న చైనాలో విడుదలైన సినిమా
- వారం రోజుల్లోనే రూ. 264.61 కోట్ల వసూళ్లు
- కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'సీక్రెట్ సూపర్‌స్టార్'
- ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 450 కోట్లు రాబట్టిన సినిమా
'సీక్రెట్ సూపర్‌స్టార్' తొలిరోజే భారీస్థాయిలో 6.79 మిలియన్ డాలర్లు (రూ. 43.35 కోట్లు) రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. రెండో రోజు 10.55 మిలియన్లు, మూడో రోజు 9.90 మిలియన్లు, నాలుగో రోజు 5.02 మిలియన్లు, ఐదో రోజు 4.88 మిలియన్లు, ఆరో రోజు 4.41 మిలియన్లు సాధించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ. 450 కోట్లు రాబట్టినట్లు తెలిసింది.