రాజ్ తరుణ్ తీసుకున్న కొత్త నిర్ణయం
- ఆకట్టుకోలేకపోయిన 'రంగుల రాట్నం'
- ప్రమోషన్స్ లోపమేనంటోన్న రాజ్ తరుణ్
- ఇకపై ఈ విషయంలో జాగ్రత్తలు
సంక్రాంతి సెలవుల్లో యూత్ కి సంబంధించిన కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, వాళ్ల మనసులను దోచుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా ఇలా పరాజయంపాలు కావడం రాజ్ తరుణ్ ను బాగా హర్ట్ చేసిందట. సరైన ప్లానింగ్ .. ప్రమోషన్స్ లేకపోవడం వల్లనే ఈ సినిమా ఆడియన్స్ కి రీచ్ కాలేదని రాజ్ తరుణ్ భావిస్తున్నాడట. ఈ సారి నుంచి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.