Poonam kaur Lal: పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. కత్తి ట్వీట్‌కు ఘాటు రిప్లై!

  • దేశంలో శృంగార తారలకు ఉన్న గౌరవం మరెవరికీ లేదు
  • సాధారణ మహిళలపై అభాండాలు వేయడం, వేధించడం అలవాటుగా మారింది
  • మహిళలు మనసు  చంపుకుని బతకాల్సి వస్తోంది
  • పూనమ్ కౌర్ ఆవేదన

శృంగార తారలపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో పోర్న్ స్టార్లకు ఉన్నంత గౌరవం సాధారణ మహిళలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మరెవరికీ దక్కని జీవితం, గౌరవం వారికి దక్కుతున్నాయని పేర్కొంది. జీవితంలో ఏదైనా సాధించాలని ముందుకొచ్చే మహిళలను వేధించడం, అభాండాలకు గురిచేయడం పరిపాటిగా మారిందని పేర్కొంది. దీంతో వారు తమ ఆత్మాభిమానాన్ని, మనసును, శరీరాన్ని చంపుకుని బతకాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న షార్ట్‌ఫిల్మ్ ‘జీఎస్టీ’లో శృంగార తార  మియా మల్కోవా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌పై కత్తి స్పందిస్తూ.. మియా రూపం, గొంతు, వర్మ్ షాక్ వాల్యూతోపాటు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం ఒక ఎపిక్ విలువను జోడించిందంటూ పోర్న్ స్టార్ మియాను తెగపొగిడేశాడు. పోర్న్ స్టార్ అయిన మియా మల్కోవాపై కత్తి మహేశ్, రాంగోపాల్ వర్మ పొగడ్తలు కురిపించిన నేపథ్యంలో పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

Poonam kaur Lal
Porn stars
Kathi Mahesh
RGV
  • Error fetching data: Network response was not ok

More Telugu News