ఈనెల 26 వరకు ఎదురులేని ‘అజ్ఞాతవాసి’, ‘జై సింహా’
- మరో పది రోజులపాటు విడుదలకు లేని సినిమాలు
- అప్పటి వరకు ఈ రెండింటిదే హవా
- ‘అజ్ఞాతవాసి’ నష్టాలు పూడ్చుకునే అవకాశం
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అభిమానుల అంచనాలను తలకిందులు చేసి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మరోవైపు సంక్రాంతి సెంటిమెంట్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమా ‘జై సింహా’ హిట్ టాక్‌తో బి, సి సెంటర్లలో భారీ విజయం నమోదు చేసింది. ఇప్పుడు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో మరో పది రోజులు ఈ రెండు సినిమాల హవా కొనసాగే అవకాశం ఉంది.