బాలయ్య అభిమానుల ఆగ్రహానికి గురైన కత్తి మహేశ్!
- ‘జై సింహా’ బాగాలేదంటూ కత్తి మహేశ్ రివ్యూ
- సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వ్యాఖ్య
- ఆ మాట థియేటర్ల వద్దకు వచ్చి చెప్పాలంటూ బాలయ్య అభిమానుల సవాల్
80ల కథకి, 90ల కథనంతో సినిమాను కలగాపులగం చేశారని, ‘జై సింహా’ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కత్తి మహేశ్ రేటింగ్ ఇచ్చాడు. కథ, కథనాలు ఏమంత బాగోలేవని, బాలకృష్ణ అసంబద్ధమైన పాత్రలో నటించారని అన్నాడు. అక్కడితో ఆగక సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ ఓ సెటైర్ కూడా వేశాడు. ఇది బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కత్తి ఇంట్లో కూర్చుని రివ్యూలు ఇవ్వడం కాదని, దమ్ముంటే థియేటర్ల వద్దకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమాను తీసింది ప్రేక్షకుల కోసం కానీ కత్తి కోసం కాదని ఎద్దేవా చేశారు.