బాలయ్య అభిమానులకు పెద్ద పండగ ...‘జై సింహా’కు ఐదు రోజుల పాటు ప్రత్యేక షోలకు అనుమతి!
- రేపటి నుంచి 16 వ తేదీ వరకు 24X7 ప్రత్యేక ప్రదర్శనలు
- తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలు
- ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ ప్రత్యేక ప్రదర్శనలు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించాలని, ప్రేక్షకుల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ‘జై సింహా’ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించాలని కోరుతూ సీకే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధిత శాఖకు ఇటీవల ఓ వినతిపత్రం సమర్పించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.