ప్రదీప్ తండ్రి వినతితో కోర్టుకు హాజరయ్యేందుకు మంగళవారం వరకు సమయమిచ్చిన పోలీసులు!
- పోలీసు ఉన్నతాధికారులను కలిసిన ప్రదీప్ తండ్రి
- పండగ దృష్ట్యా కొంత సమయం ఇవ్వాలని వినతి
- కోర్టుకు హాజరు కావడానికి రోజుకో సాకు చెబుతున్న ప్రదీప్
డిసెంబర్ 31 తెల్లవారుజామున డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రదీప్ ఇటీవల కౌన్సెలింగ్‌కి హాజరైన సంగతి తెలిసిందే. పట్టుబడిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడంటూ వచ్చిన వార్తలకు సమాధానంగా తాను చట్టరీత్యా నడుచుకుంటానని ఓ వీడియో విడుదల చేసిన ప్రదీప్ కోర్టుకు హాజరవడాన్ని మాత్రం ఏదో రకంగా జాప్యం చేస్తూనే ఉన్నాడు. ఆయన తాగిన మద్యం 178 పాయింట్లు దాటిన కారణంగా కచ్చితంగా జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో ఇలా సాకులు చెబుతున్నాడని మీడియాలో కథనాలు వస్తున్నాయి.