నా అసలు పేరు మంజుల .. ఆమని అనే పేరు ఈవీవీ గారు పెట్టారు: ఆమని
- తమిళంలో గంగై అమరన్ దర్శకత్వంలో ఫస్టు మూవీ చేశాను
- ఆయన నాకు 'మీనాక్షి' అనే పేరు పెట్టారు
- తెలుగులో 'జంబలకిడి పంబ' ఫస్టు మూవీ
- అప్పటి నుంచి ఆమని అయ్యాను
"నా అసలు పేరు మంజుల .. తమిళంలో గంగై అమరన్ గారి దర్శకత్వంలో నా మొదటి సినిమా చేశాను. అప్పుడు ఆయన నాకు మీనా అనే పేరు పెట్టారు. అప్పటికే మీనా కూడా ఎంట్రీ ఇచ్చింది .. తమిళంలో రెండు మూడు సినిమాలు చేసింది కూడా. అందువలన నాకు మీనాక్షి అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే తమిళంలో రెండు మూడు సినిమాలు చేశాను గానీ ఆ పేరుకలిసి రాలేదు. ఆ సమయంలో ఈవీవీ సత్యనారాయణ గారు 'జంబలకిడి పంబ'లో నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సమయంలో నా పేరును 'ఆమని'గా ఈవీవీ గారు మార్చారు" అంటూ చెప్పుకొచ్చారు.