నేనెప్పుడూ కుర్రాడినే.. నాకు వయసుతో పనిలేదు!: 'జైసింహా' వేడుకలో నందమూరి బాలకృష్ణ
- హైదరాబాద్ లో ‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక
- ఈ సినిమా చాలా అద్బుతంగా వచ్చింది
- ప్రేమను అందరికీ పంచిపెట్టాలన్నదే ఈ సినిమాకు మూలం
- ప్రముఖ నటుడు బాలకృష్ణ
‘కళ’ యొక్క అర్థం పరమార్థం అనేది తాను నటించే ప్రతి సినిమాలో ఉంటుందని, ప్రేమను అందరికీ పంచిపెట్టమన్నది ఈ సినిమాకు మూలమని, కనుక అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ సినిమాను చేశామో, దాని ప్రతిఫలం ప్రేక్షకులు, అభిమానులు అందుకోవాలని ఆశిస్తున్నానని బాలయ్య అన్నారు. కాగా, ఈ నెల 12న ‘జై సింహా’ విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, హరిప్రియ, నటాషా నటించారు.