రాఖీ సావంత్‌పై పరువు నష్టం దావా వేసిన హనీప్రీత్ తల్లి!
- రూ. 5 కోట్ల నష్టపరిహారానికి నోటీసు పంపించిన ఆశా తనేజా
- 30రోజుల్లోగా క్షమాపణలు తెలియజేయాలని వ్యాఖ్య
- హనీప్రీత్ మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిందని ఆరోపణ
గుర్మీత్ సింగ్‌తో ఒకప్పుడు మంచి స్నేహం నడిపిన రాఖీ సావంత్, ప్రస్తుతం ఆయన జీవిత కథ ఆధారంగా 'అబ్ హోగా ఇన్సాఫ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇందులో హనీప్రీత్ పాత్రను ఆమె పోషిస్తోంది. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో గుర్మీత్ బాబాకు తాను దగ్గరవుతుండటాన్ని హనీప్రీత్ జీర్ణించుకోలేకపోయిందని రాఖీ పేర్కొంది. ఆ వ్యాఖ్యలు హనీప్రీత్ వ్యక్తిత్వాన్ని కించపరిచేట్లుగా ఉన్నాయని ఆశా తనేజా తెలిపారు.