స్వయంగా మరుగుదొడ్డి కట్టిన నటి త్రిష!
- యూనిసెఫ్ ఇండియా కార్యక్రమంలో త్రిష
- గోడను నిర్మించిన నటి
- కాంచీపురం జిల్లాలో కార్యక్రమం
ఇందులో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన త్రిష మరుగుదొడ్లను నిర్మించే కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఇసుక, సిమెంట్ ను తానే కలిపి, ఇటుకలతో కొంచెం గోడను నిర్మించింది. యూనిసెఫ్ ఇండియాకు కూడా త్రిష బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి శానిటేషన్ ప్రోగ్రామ్ లో ఆమె భాగస్వామి అయింది. సురక్షిత పరిసరాలకు సంబంధించి ఆమె ప్రచారం చేస్తోంది. త్రిష చేస్తున్న పనులకు జనాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి
.