'అజ్ఞాతవాసి' ట్రైలర్ రిలీజ్ వాయిదా?
- ఈ నెల 31న పవన్ పాట రిలీజ్
- జనవరి 4 లేదా 5వ తేదీల్లో టీజర్ రిలీజ్
- జనవరి 10వ తేదీన సినిమా రిలీజ్
ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజున 'నా పేరు సూర్య' టీజర్ వస్తుండటం వలన, 'అజ్ఞాతవాసి' టీజర్ ను ఆపుతున్నట్టుగా చెబుతున్నారు.
డిసెంబర్ 31న పవన్ పాటను రిలీజ్ చేసి .. ఆ మరుసటి రోజునే టీజర్ ను వదలడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నారట. పాట వైపు నుంచి అందరి దృష్టిని వెంటనే టీజర్ వైపు మళ్లించినట్టు అవుతుందని భావిస్తున్నారని సమాచారం. అందువలన టీజర్ ను జనవరి 4 లేదా 5వ తేదీల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.