సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా లేనట్టేనట!
- హను రాఘవపూడితో శర్వానంద్
- ఆ తరువాత ప్రాజెక్టు హరీశ్ శంకర్ తో
- సుధీర్ వర్మతో సినిమా డౌట్ అంటూ టాక్
హారిక హాసిని సంస్థ వారు మారుతి - చైతూ సినిమాతో పాటు ఈ సినిమాను కూడా వచ్చేనెల మొదటివారంలో పట్టాలెక్కించాలనుకున్నారు. అయితే ఈ కథ విషయంలో కొన్ని సూచనలు చేసిన శర్వానంద్, హను రాఘవపూడితో మరో ప్రాజెక్టును మొదలుపెట్టేశాడు. అంతేకాదు .. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో హరీశ్ శంకర్ తో ఓ సినిమా చేయడానికి కూడా అంగీకరించాడట. దాంతో ఇక సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా లేనట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంపై హారిక హాసిని వారు .. సుధీర్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.