girl friend: 26 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనున్న 52 ఏళ్ల మిలింద్ సోమన్.. ప్రియురాలి కుటుంబం గ్రీన్ సిగ్నల్!
- అంగీకరించిన అంకిత కుటుంబ సభ్యులు
- వయసుల అంతరాన్ని పెద్దగా పట్టించుకోని అంకిత కుటుంబం
- 2018లో ఒక్కటి కానున్న జంట
రన్నర్, మోడల్ మిలింద్ సోమన్ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్న వారికి అంకిత కొన్వర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. వయసుల మధ్య భారీ తేడా ఉన్నప్పటికీ వారిద్దరి జంటను పొగడ్తలతో ముంచెత్తుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరికీ ఆనందాన్ని కలిగించే విషయం ఒకటి ఇటీవల బయటికి వచ్చింది.
త్వరలో మిలింద్, అంకితలు పెళ్లి చేసుకోబోతున్నారనేది దాని సారాంశం. అవును... ఇందుకు అంకిత కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. 52 ఏళ్ల మిలింద్, 26 ఏళ్ల అంకితల మధ్య ఉన్న వయసుల అంతరాన్ని ఆమె కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదట. ఇటీవల అంకిత బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకి మిలింద్ హాజరయ్యారట. అక్కడ ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులతో మిలింద్ ముచ్చటించినట్లు, తర్వాత పెళ్లి విషయం కూడా మాట్లాడినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. వారంతా అంగీకరించడంతో 2018లో ఈ జంట ఒక్కటి కాబోతున్నారని పేర్కొంది.
ఒకవేళ ఈ వార్త నిజమే అయితే... మిలింద్‌కి ఇది రెండో పెళ్లి అన్నమాట. గతంలో ఫ్రెంచ్ నటి మైలీన్ జంపనోయిని మిలింద్ వివాహం చేసుకున్నారు. 2006 నుంచి 2009 వరకు వీరి దాంపత్య జీవితం కొనసాగింది. ఈ పెళ్లికి ముందు మిలింద్, సూపర్ మోడల్ మధు సప్రేతో ప్రేమాయణం నడిపాడు. అప్పట్లో వీరిద్దరూ కలిసి నగ్నంగా నటించిన టఫ్ షూస్ ప్రకటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.