'జై' స్నేహితుడు మాత్రమే .. నా మనసులో ఎవరూ లేరు: అంజలి
- అంజలి తాజా చిత్రంగా 'బెలూన్'
- 'జై' జోడీగా కనిపించనున్న అంజలి
- ఈ నెల 29న ఈ సినిమా విడుదల
తనకున్న మంచి స్నేహితుల్లో 'జై' ఒకరనీ, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని చెప్పింది. అప్పట్లో ఆమె కోసం 'జై' 'దోసె' వేయడం .. ఆ సందర్భంలో ఆమె చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించగా, 'దోసె' వేసి ఇవ్వడానికి ప్రియుడే అయ్యుండాలా? అంటూ సమాధానమిచ్చింది. తమ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదనీ, ఇప్పటికీ తన మనసులో ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. ఇక ఈ 'బెలూన్' సినిమా అదే పేరుతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది.