భయపెడుతూనే ఆసక్తిని రేపుతోన్న 'బెలూన్' ట్రైలర్
- అంజలి తాజా చిత్రంగా 'బెలూన్'
- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో కథ
- ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఫ్లాష్ బ్యాక్ సీన్స్ .. ప్రస్తుతం నడుస్తున్న కథకి సంబంధించిన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. కొంతకాలం క్రితం సైకిల్ కి 'బెలూన్స్' కట్టుకుని అమ్మే ఓ యువకుడు .. ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వలన అతను ఆ అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ ఇంట్లో దెయ్యంగా మారిన ఆ అమ్మాయి .. బెలూన్ లా తిరుగుతూ ఉంటుంది. అదే ఇంట్లోకి జై .. అంజలి రావడం .. అక్కడ వాళ్లకి ఎదురయ్యే భయంకర సంఘటనలతో ఈ సినిమా కొనసాగుతుందట. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.