చెన్నై వెళ్లిన కొత్తలో హోటల్లో పనిచేశాను: శుభలేఖ సుధాకర్
- చదువు పూర్తి కాగానే చెన్నై వెళ్లాను
- ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాను
- అక్కడ హోటల్లో ఉద్యోగం సంపాదించాను
- ఆ తరువాత సినిమా ప్రయత్నాలు
" నేను విశాఖలో బీకామ్ చేశాను .. ఆ తరువాత చెన్నై వెళ్లి అక్కడి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పటి వరకూ నాన్న డబ్బులు పంపిస్తూ వచ్చారు. ఇక నా కాళ్లపై నేను నిలబడాలి అనుకుంటూ ఉండగా .. ఓ హోటల్లో క్యాషియర్ కావాలంటూ యాడ్ వచ్చింది. నేను అప్లై చేయడం .. నాకు ఆ ఉద్యోగం రావడం జరిగిపోయాయి. చెన్నైలో ఉండటానికి ఒక ఉద్యోగం దొరికింది .. నన్ను నేను పోషించుకోవడానికి ఒక ఆధారం దొరికింది .. సినిమాల్లో ప్రయత్నాలు చేయడానికి అవకాశం లభించింది" అంటూ చెప్పుకొచ్చారు.