మహేశ్ తో వినాయక్ మూవీ ఖాయమైపోయినట్టే!
- 'భరత్ అనే నేను' చేస్తోన్న మహేశ్ బాబు
- తన 25వ సినిమా వంశీ పైడిపల్లితో
- తరువాత దర్శకుడు త్రివిక్రమ్
- ఆ నెక్స్ట్ ప్రాజెక్టు వినాయక్ తో
ప్రస్తుతం కొరటాలతో 'భరత్ అనే నేను' చేస్తోన్న మహేశ్ బాబు, ఆ తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఇక 26వ సినిమాను త్రివిక్రమ్ తో సెట్ చేసుకున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును వినాయక్ తో చేయడానికి మహేశ్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. చిరూతో చేసిన 'ఖైదీ నెంబర్ 150'తో హిట్ కొట్టేసిన వినాయక్, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ పూర్తి స్థాయి మాస్ హీరో అనిపించుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక మహేశ్ తో వినాయక్ చేయనున్న కథపై అందరిలో ఆసక్తి మొదలవడం ఖాయమనే చెప్పాలి.