తాజా సినిమా టీజర్.. జ్యోతిక నోటి వెంట అసభ్యపు మాటలు... నువ్విలా ఏంటని మండిపడుతున్న నెటిజన్లు!
- త్వరలో విడుదలకు సిద్ధంగా జ్యోతిక చిత్రం 'నాచియార్'
- టీజర్ లో బూతులు మాట్లాడిన జ్యోతిక
- ఇలాంటి సంభాషణలేంటని నెటిజన్ల మండిపాటు
ఓ పోలీస్ స్టేషన్ లో జ్యోతిక రాయలేని విధంగా బూతులు తిడుతున్నట్టు టీజర్ లో ఉండటమే ఇందుకు కారణం. ఈ సినిమాకు దర్శకుడు బాలా కాగా, ఆయన చిత్రాల్లో ఇటువంటి సంభాషణలు సాధారణమే అయినా, సీనియర్ నటి అయిన జ్యోతిక ఇటువంటి మాటలు చెప్పేందుకు ఎలా అంగీకరించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు ఎత్తులు అవసరమా? అని కొందరు అంటుంటే, సెన్సార్ ఏం చేస్తోందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ సంభాషణలు తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇక ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి!