'జై సింహ' మోషన్ పోస్టర్ వచ్చేస్తోంది
- బాలకృష్ణ తాజా చిత్రంగా 'జై సింహ'
- దర్శకుడిగా కేఎస్.రవికుమార్
- నవంబర్ 1న మోషన్ పోస్టర్ రిలీజ్
- జనవరి 12న సినిమా రిలీజ్
ఈ సినిమా నుంచి వచ్చేనెల 1వ తేదీన టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా వుంటుందనే విషయంలో ఆసక్తిగా వున్నారు. మోషన్ పోస్టర్ రాకతో ఆ సస్పెన్స్ కి తెరపడనుంది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.