అకీరా, ఆరాధ్యలను ఏం చేస్తావ్?... కొత్త భర్త ఈ పిల్లలను చూడకుంటే..?: రేణుపై అభిమానుల ప్రశ్నల వర్షం
- రేణూ దేశాయ్ టైమ్ లైన్ లో ఆగని కామెంట్లు
- పిల్లల ప్రస్తావన తెచ్చిన పవన్ అభిమానులు
- కొత్త భర్త పట్టించుకోకుంటే సంగతేంటని ప్రశ్న
- పిల్లలపై పవన్ ప్రేమ చచ్చిపోలేదని వ్యాఖ్యలు
- 'వదినా' అని పిలవబోమని హెచ్చరికలు
దీనిపై ఆమె మండిపడగా ఆమె సోషల్ మీడియా టైమ్ లైన్ పై కామెంట్ల వరద కొనసాగుతూనే ఉంది. తాజాగా పవన్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పిల్లలకు తల్లిగా బాధ్యత లేదా? అకీరా, ఆరాధ్యలను ఏం చేస్తావు? పవన్ అన్న నుంచి మీరు విడాకులు తీసుకుని ఉండవచ్చు. కానీ పవన్ పిల్లలకు దూరం కాలేదుగా? మీ కొత్త భర్త పిల్లలను చేరదీయకుంటే..? మీ జంటకు పిల్లలు పుడితే, అకీరా, ఆరాధ్య సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంకొందరు మరో అడుగు ముందుకేసి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, పవన్ కల్యాణ్ లేకుంటే అసలు రేణు దేశాయ్ అన్న పేరే బయటకు వచ్చుండేది కాదని, ఇకపై 'వదినగారూ' అని పిలవబోమని కామెంట్లు పెడుతున్నారు. ఇకపై ఇంటర్వ్యూల్లో పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించవద్దని హెచ్చరిస్తున్న కామెంట్లూ వస్తున్నాయి.