బాలకృష్ణకి విలన్ గా వివేక్ ఒబెరాయ్?
- కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ
- విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ తో సంప్రదింపులు
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్
ఈ విషయంపై వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్లో ఇదే టాక్ వినిపిస్తోంది. గతంలో వివేక్ ఒబెరాయ్ తెలుగులో 'రక్త చరిత్ర' సినిమాలో నటించాడు. రీసెంట్ గా తమిళంలో వచ్చిన ' వివేగం' సినిమాలోను ఆయన మెప్పించాడు. ఇక బాలకృష్ణ మూవీలో వివేక్ ఒబెరాయ్ చేయడం నిజమే అయితే, అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.