యంగ్ హీరోతో రంగంలోకి 'గుండెజారి గల్లంతయ్యిందే' దర్శకుడు
కెరియర్ ఆరంభం నుంచి కూడా ప్రేమకథలతోనే యూత్ ను ఎక్కువగా రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై వున్నాయి. అవి పూర్తి కాగానే అక్టోబర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం కథానాయిక అన్వేషణ జరుగుతోందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.