'రాజుగాడు యమ డేంజర్'లో కీలకంగా రావు రమేశ్!
ఈ సినిమాలో ఆయనకి చెప్పుకోదగిన పాత్ర లభించిందని అంటున్నారు. ఈ సినిమాలో రావు రమేశ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందనీ .. సెకండాఫ్ లో మంత్రముగ్ధులను చేస్తుందని చెబుతున్నారు. ఈ పాత్ర చాలాకాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందట. సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ - అమైరా దస్తూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది.