శ్రీదేవిలా నటించడానికి ట్రై చేశా: 'బెలూన్' హీరోయిన్ జననీ అయ్యర్!
తాజాగా ఆమె మాట్లాడుతూ .. ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని అంది. గతంలో శ్రీదేవి 'మూండ్రామ్ పిరై' అనే సినిమాలో .. గతాన్ని మరిచిపోయి అమాయకంగా మారిపోయిన పాత్రను అద్భుతంగా పోషించారనీ, అదే తరహాలో ఈ సినిమాలో తన పాత్ర కొనసాగుతుందని చెప్పింది. శ్రీదేవిలా నటించడం అంత తేలికైన విషయం కాదనీ .. అయినా తనవంతు ప్రయత్నం చేశానని అంది. ఈ విషయంలో దర్శకుడు శిరీష్ సహకారం మరిచిపోలేననీ .. ఈ పాత్ర తనకి మరింత గుర్తింపు తీసుకొస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేసింది.