'ఉయ్యాలవాడ' కోసం నయనతారకి 4 కోట్లు?
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సాధారణంగా ఒక భాషలో చేసే సినిమాకే నయనతార రెండున్నర నుంచి మూడు కోట్ల వరకూ తీసుకుంటుంది. ఈ సినిమా నాలుగు భాషలకి సంబంధించినది కావడంతో ఆమెకి 4 కోట్లు ముడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.