నయన్ తమిళ మూవీలో సమంత కీలక పాత్ర!
ఇక ఈ సినిమాలో సమంత ఒక కీలకమైన పాత్రను పోషిస్తోందట. ఆమె పోర్షన్ కి సంబంధించిన కొంతభాగం షూటింగును రీసెంట్ గా చిత్రీకరించారని సమాచారం. చాలా సాదా సీదా యువతిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడుతోన్న ఒక ముఠాపై కథానాయకుడు చేసే పోరాటంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. నయనతార .. సమంత పోటీపడి నటించే ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ - స్నేహ ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ ఉండటం విశేషం.