పాపాలను హరించే గంగా జలం

భూమిపై అనేక నదులు ప్రవహిస్తూ ఉన్నప్పటికీ గంగానదికి ఎంతో ప్రత్యేకత వుంది. గంగానది .. గంగా జలం అత్యంత పవిత్రమైనవని పురాణాలు చెబుతున్నాయి. గంగాదేవి .. గంగా జలంతో కూడిన ఘటాలను చేతులలో ధరించి 'మొసలి' వాహనంపై పద్మాసనం వేసుకుని కనిపిస్తుంది. కాశీలో గంగా మరింత పవిత్రతను సంతరించుకుని దర్శనమిస్తూ ఉంటుంది.

 గంగానదిలో స్నానమాచరిస్తే అటు ఏడు తరాలవారు .. ఇటు ఏడు తరాలవారు తరిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గంగా జలాన్ని తలపై చల్లుకోవడం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి. ఎవరి అస్థికలనైతే గంగా జలంలో కలుపుతారో వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. గంగా నదిని దర్శించుకున్నంత మాత్రాన .. గంగా నామాన్ని స్మరించడం వలన సమస్త పాపాలు .. దోషాలు .. వ్యాధులు .. బాధలు తొలగిపోతాయని వ్యాసభగవానుడు చెప్పాడు.     


More Bhakti News