‘ఇంగ్లండ్‌లోని ఓ చిన్న రెస్టారెంట్లో రాజీవ్ గాంధీతో..’ తొలి ‘ఎక్స్’ పోస్ట్‌లో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు!
- ‘ఎక్స్’లో తొలిసారి పోస్టు చేసిన సోనియా గాంధీ
- రాజీవ్‌తో ప్రేమకథ 1965లో కేంబ్రిడ్జ్‌లో ప్రారంభమైనట్లు వెల్లడి
- గ్రీకు రెస్టారెంట్లో రాజీవ్ పరిచయమైనట్లు చెప్పిన సోనియా
- రాజీవ్ సౌమ్య స్వభావం తనను ఆకట్టుకుందని వెల్లడి
- నవంబర్ 10న ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విడుదల
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తన ప్రేమకథ ఎలా మొదలైందో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. 1965లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్లో తమ తొలి పరిచయం ఏర్పడిందని తెలిపారు. తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ గురించి పరిచయం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తొలిసారి ఓ వీడియోను పంచుకున్నారు. ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది.
‘‘కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్లో నా ప్రేమ ప్రయాణం మొదలైంది. రాజీవ్, నేను.. ప్రేమ, నవ్వులు, మధుర జ్ఞాపకాలతో నిండిన ఓ ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. నవంబర్ 10న ఆ ప్రపంచాన్ని మీతో పంచుకోబోతున్నాను’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.
1965లో ఆ రెస్టారెంట్లో రాజీవ్ గాంధీని తొలిసారి కలిసిన సందర్భాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఇంగ్లండ్‌లో మంచి ఆహారం దొరకడం కష్టంగా ఉండేదని, రెస్టారెంట్లు కూడా తక్కువగా ఉండేవని చెప్పారు. చివరకు భారతీయ, ఇటాలియన్ విద్యార్థులు తరచూ వెళ్లే ఓ గ్రీకు రెస్టారెంట్ గురించి తెలుసుకున్నానని వివరించారు. అక్కడే రాజీవ్‌తో తన పరిచయం మొదలైందన్నారు.
‘‘రాజీవ్ చాలా అందంగా ఉండేవారు. ఓ కామన్ ఫ్రెండ్ మమ్మల్ని పరిచయం చేశారు. ఆ తర్వాత స్నేహితులమయ్యాం. స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లేవాళ్లం. ఆయనతో పరిచయమైన వెంటనే కలిసి ఉండాలని నాకు అనిపించింది. ఆయనకూ అలాగే అనిపించిందని తర్వాత తెలుసుకున్నాను’’ అని సోనియా తెలిపారు.
రాజీవ్లోని సున్నితమైన స్వభావం తనను తొలి పరిచయంలోనే ఆకట్టుకుందని చెప్పారు. ‘‘ఆయన ముఖంలో ఓ సౌమ్యత కనిపించేది. అందంగా ఉండటమే కాకుండా, ఆ సౌమ్య స్వభావం కూడా స్పష్టంగా కనిపించేది. అది నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆయనను తొలిసారి కలిసిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అని గుర్తుచేసుకున్నారు.
ఎక్స్‌లో సోనియా గాంధీ చేసిన తొలి పోస్టు ఇదే. అంతకుముందు గురువారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఖాతా ప్రారంభించారు. తన పుస్తకం తొలి రూపాన్ని పాఠకులతో పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రేమ, బాధ్యత, నష్టం, తనకంటూ ఓ చోటును కనుగొనడం వంటి అంశాలతో ఈ పుస్తకం సాగుతుందని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో పుస్తకం తొలి ప్రతులను అందుకున్న సోనియా, తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
మొత్తం 544 పేజీలతో రూపొందిన ఈ పుస్తకంలో ఇటలీలో యుద్ధానంతర కాలంలో గడిచిన బాల్యం నుంచి రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహం వరకు సోనియా జీవిత ప్రయాణం ఉంటుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలతో సహా ఆమె జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగత విషాదాలనూ ఇందులో ప్రస్తావించారు. ఆ తర్వాత భారత రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్రను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆల్ఫ్రెడ్ ఏ.నాఫ్ ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తుండగా, భారత్‌లో హార్పర్‌కాలిన్స్ ప్రచురిస్తోంది. పుస్తకానికి ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.