సంగారెడ్డి ఫ్యాక్టరీలో విషాదం.. గ్యాస్ లీకై ఇద్దరి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంగారెడ్డి ఫ్యాక్టరీలో విషాదం.. గ్యాస్ లీకై ఇద్దరి మృతి

Tragedy in Sangareddy factory two died due to gas leak
  • సంగారెడ్డి జిల్లా సరాకా పరిశ్రమలో గ్యాస్ లీక్
  • మృతులు సుదర్శన్, బాలాజీగా గుర్తింపు
  • యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సుదర్శన్, బాలాజీగా గుర్తించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఊపిరాడకపోవడంతోనే వారు మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ దుర్ఘటనతో పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Saraka Industry
Sangareddy Gas Leak
Telangana Industrial Accident
Gaddapotharam Factory Death
Sudarshan and Balaji
Industrial Safety Negligence

More Telugu News