మా నాన్న అందగాడు కావడం మా తాతయ్యకు నచ్చలేదు.. పెళ్లి వద్దన్నారు: సల్మాన్ ఖాన్
- బిగ్ బాస్‌లో తన తల్లిదండ్రుల పెళ్లి నాటి విషయాలు పంచుకున్న సల్మాన్
- మతం కాదు, నాన్న నటుడు, అందగాడు కావడమే తాతయ్య వ్యతిరేకతకు కారణం
- ఐదేళ్ల తర్వాత మనవళ్లు పుట్టాక పశ్చాత్తాపంతో రాజీకి వచ్చిన తాతయ్య
- గొడవపడి వస్తే పుట్టింట్లో ఉండొద్దని అమ్మకు తాతయ్య గట్టిగా చెప్పేవారు
- హెలెన్‌తో నాన్న రెండో పెళ్లి తర్వాత మొదట ఇబ్బందులు ఎదురయ్యాయి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20' వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో ఆయన తన తల్లిదండ్రులు సుశీలా చరక్ (సల్మా ఖాన్), సలీం ఖాన్ ల వివాహం నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. వారి పెళ్లికి తన తాతయ్య (తల్లి సుశీలా తండ్రి) ఎందుకు వ్యతిరేకత తెలిపారనే అసలు కారణాన్ని సల్మాన్ బయటపెట్టారు.
1964 నవంబర్‌లో తన తల్లిదండ్రుల వివాహం జరిగిందని, అప్పట్లో వారి పెళ్లిని తన తాతయ్య తీవ్రంగా వ్యతిరేకించారని సల్మాన్ తెలిపారు. చాలామంది అనుకున్నట్టుగా మతపరమైన కారణాలతో ఆయన అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు.
"మా నాన్న సలీం ఖాన్ చూడటానికి చాలా అందంగా ఉండేవారు. పైగా నటుడు కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ వాతావరణంలో తన కూతురు ఎలా బతుకుతుందని మా తాతయ్య ఆందోళన చెందారు. అదే ఆయన వ్యతిరేకతకు అసలు కారణం" అని సల్మాన్ వివరించారు. అయితే, తన తల్లి సుశీలా చరక్ తోబుట్టువులకు మాత్రం సలీం ఖాన్‌పై సదభిప్రాయమే ఉండేదని చెప్పారు.
పెళ్లి తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు తాతయ్య.. మా నాన్న (సలీం ఖాన్)తో మాట్లాడలేదు అని సల్మాన్ గుర్తుచేసుకున్నారు. మా తమ్ముడు సోహైల్ పుట్టిన తర్వాత, తాతయ్య మనసు మార్చుకున్నారు అని తెలిపారు. ఆయన మహిమ్ నుంచి బాంద్రాకు స్వీట్లతో వచ్చి, తన అల్లుడితో రాజీ పడ్డారని చెప్పారు. "నా మనవళ్ల బాల్యాన్ని దూరం చేసుకున్నాను. ప్రపంచంలోనే అత్యంత మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నాను" అని తాతయ్య ఆ తర్వాత ఎంతో బాధపడ్డారని, ఆ పశ్చాత్తాపం ఆయన చివరి శ్వాస వరకు ఉందని సల్మాన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నారు. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులు గొడవపడి, అమ్మ పుట్టింటికి వెళితే తాతయ్య ఆమెను ఇంట్లోకి రానిచ్చేవారు కాదని సల్మాన్ తెలిపారు. "ఇది నీ ఇల్లు కాదు. నీ భర్త ఇల్లే నీది. అక్కడికే వెళ్లి సమస్యను పరిష్కరించుకో. ఎప్పుడైనా రావచ్చు కానీ, గొడవపడి మాత్రం రావద్దు" అని గట్టిగా చెప్పి పంపించేవారని గుర్తుచేసుకున్నారు.
ఇదే క్రమంలో, 1981లో తన తండ్రి సలీం ఖాన్, హెలెన్‌ను రెండో వివాహం చేసుకున్నప్పుడు మొదట్లో తాము (పిల్లలు) కొంత వ్యతిరేకత చూపినప్పటికీ, కాలక్రమేణా అంతా సర్దుకుందని సల్మాన్ ఆనాటి కుటుంబ పరిస్థితులను కూడా ప్రస్తావించారు.