తన పార్టీలోకి సహచరుడిని ఆహ్వానించిన విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

తన పార్టీలోకి సహచరుడిని ఆహ్వానించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy invites colleague into his new party
  • కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు తిరుమల శ్రీవారి దర్శనం
  • తనతో కలిసి రావాలని ఓవి రమణకు బహిరంగ ఆహ్వానం
  • గతంలో టీటీడీ బోర్డులో కలిసి పనిచేశామని వెల్లడి
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. త్వరలో ప్రారంభించనున్న పార్టీలోకి తన మిత్రుడు, టీటీడీ మాజీ సభ్యుడు ఓవి రమణను బహిరంగంగా ఆహ్వానించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

కొత్త పార్టీ ప్రారంభించబోతున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. గతంలో తాను, ఓవి రమణ నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఇప్పుడు తన కొత్త పార్టీలోనూ ఇద్దరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీయర్ స్వామి, ఇతర పీఠాధిపతుల ఆకాంక్ష మేరకు ఈ నిర్మాణం జరగాలని కోరారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన కీలక నేతలను సంప్రదిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.

Advertisement
Vijayasai Reddy
New Political Party
OV Ramana
Andhra Pradesh Politics
Tirumala TTD
YSRCP Alternative

More Telugu News